సోమవారం, 25 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2022 (19:50 IST)

పుష్ప-2లో కేథరిన్.. అల్లు అర్జున్ అంతు చూస్తుందా?

పుష్ప-2 నుంచి ఓ వార్త ఫిలిమ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న అల్లు అర్జున్ పుష్ప-2లో ఇప్పటికే విజయ్ సేతుపతి, అర్జున్ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 
 
రష్మిక కథానాయికగా అలరించనున్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా విడుదల ఉంటుందని సమాచారం.
 
తాజాగా ఈ సినిమాలో కేథరిన్ పేరు తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ కలిగిన లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించనుందని టాక్ వస్తోంది. 
 
పుష్ప అంతు చూసే రోల్‌లో కేథరిన్ కనిపిస్తుందని అంటున్నారు. ఆమె బాడీ లాంగ్వేజ్‌ను కూడా డిఫరెంట్‌గా డిజైన్ చేశారని టాక్. బన్నీతో కేథరిన్ ఇంతకుముందు ఇద్దరమ్మాయిలతో, సరైనోడు వంటి సినిమాల్లో కనిపించింది.