1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 4 మార్చి 2024 (10:15 IST)

ప్రభాస్, నయనతార కాంబినేషన్ కోసం సెట్ వేస్తున్న మంచు విష్ణు?

prabhas
prabhas
మంచు విష్ణు కన్నప్పగానటిస్తున్న షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతోంది. ఇందులో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఫైనల్ షెడ్యూల్ ఇటీవలే ఆరంభమైంది. అయితే ఇందులో ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. కన్నప్పకు కనిపించే శివునిగా ప్రభాస్ నటిస్తున్నాడని ఇదివరకే యూనిట్ తెలియజేసింది. కాగా, ఇందులో పార్వతిగా నయనతార నటించనున్నదని టాక్ వినిపిస్తోంది.
 
సమాచారం మేరకు త్వరలో ఈ విషయాన్ని వెల్లడించనున్నారు. ఇక ఇందులో మోహన్ బాబు రుషిగా నటిస్తుండగా మోహన్ లాల్ మరో కీలక పాత్రలో పోషిస్తున్నారు. ప్రభాస్ కోసం చక్కటి సెట్ ను వేస్తున్నారు. రీసెంట్ గా బాలక్రిష్ణ కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. చూద్దాం ఇంకా ఎన్ని ట్విస్ట్ లు వస్తాయో.