మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (20:05 IST)

మళ్లీ స్క్రీన్‌పై లవ్ స్టోరీ జంట.. నిజమేనా?

Love story still
లవ్ స్టోరీ పెయిర్ మళ్లీ స్క్రీన్‌పై కనిపించనుంది. అవును మీరు చదువుతున్నది నిజమే. అసలు సంగతి ఏంటంటే.. అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం గీతాఆర్ట్స్‌లో ఒక సినిమా చేస్తున్నారు. చందూ మొండేటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. 
 
తాజాగా ఈ మూవీలో నటించబోయే హీరోయిన్‌ని ఎంపిక చేశారు. హీరోయిన్ ఎవరు అనేది చెప్పకుండా కేవలం ఎంట్రీని మాత్రం తెలియజేస్తూ ఒక వీడియో షేర్ చేశారు. 
 
ఆ వీడియో పోస్ట్ చూసిన నెటిజెన్స్.. ఆమె సాయిపల్లవి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరు అనేది ఇంకా క్లారిటీ లేదు. 2018లో జరిగిన నిజ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది.