శనివారం, 30 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2023 (10:26 IST)

బాలయ్య సినిమాలో సింగర్ సునీత నటిస్తుందా?

Sunitha
నందమూరి నటసింహం బాలకృష్ణ సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు గ్రాండ్‌గా జరిగాయి. 
 
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ క్రేజీ ప్రాజెక్టు ఎన్బీకే 108 వర్కింగ్ టైటిల్‌తో గ్రాండ్‌గా ప్రారంభించారు. తాజాగా ఈ సినిమాలో సింగర్స్ సునీత ఓ కీలక పాత్రలో నటిస్తుందంటూ ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. 
 
షైన్ స్క్రీన్ బ్యానర్స్, సాహు గారిపాటీ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఇప్పటికే హైదరాబాదులో జైలు సెట్‌ను నిర్మించారు. అనిల్ రావిపూడి బాలకృష్ణ కోసం ఓ కొత్త లుక్ ని డిజైన్ చేశారట. 
 
ఆయన స్టార్ డమ్‌కు తగినట్లు యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన పవర్ ఫుల్ స్టోరీని సిద్ధం చేసుకున్నట్లు మునుపెన్నడూ చూడని విధంగా తెరపై బాలయ్య చూపించబోతున్నట్లు హామీ ఇచ్చారు. 
 
ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ కుమార్తెగా శ్రీలీల నటించనుంది. తాజాగా ఈ సినిమాలో స్టార్ సింగర్ సునీత కూడా ఓ కీలకపాత్రలో నటించిన ఉందట అయితే బాలకృష్ణకి సపోర్టింగ్ క్యారెక్టర్‌గా నటిస్తుందని సమాచారం.