సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2023 (10:08 IST)

ఎన్‌.టి.ఆర్‌.30లో తమిళ విక్రమ్‌, సైఫ్‌ అలీఖాన్‌?

ntr-vikram
ntr-vikram
ఎన్‌.టి.ఆర్‌.30 సినిమాలో సెన్సేషనల్‌ న్యూస్‌ అంటూ ట్విట్టర్‌లో అభిమానులు సందడి చేశారు. తెలుగు సినిమా రంగంలో అదిరిపోయే కథను కొరటాల శివ తెరకెక్కిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఆర్‌.ఆర్‌.ఆర్‌.తో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఎన్‌.టి.ఆర్‌.కు కొరటాల శివ సినిమా కథపై ఆసక్తి నెలకొంది. ఈ చిత కథ ఐలాండ్‌ పోర్ట్‌ బ్యాక్‌ డ్రాప్‌లో వుండబోతుందనే వార్త కూడా వినిపిస్తుంది.
 
ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్లో వుండబోతుంది. కావున నటీనటుల విషయమై పాన్‌ ఇండియా స్టార్‌లను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తమిళ అపరిచితుడు విక్రమ్‌ పేరు పరిశీలనతో వున్నట్లు తెలిసింది. అయితే విక్రమ్‌ వివిధ గెటప్‌లతో ఓ సినిమా చేస్తున్నాడు. ఆయన డేట్స్‌ కుదరకపోతే సైఫ్‌ అలీఖాన్‌ పేరుకూడా పరిశీలించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా త్వరలో సెస్సేషనల్‌ న్యూస్‌ రాబోతుందని తెలుస్తుంది. ఇటీవలే అమిగోస్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఎన్‌.టి.ఆర్‌. తన 30వ సినిమా గురించి చెబుతూ, ఫిబ్రవరిలో లాంఛనంగా ప్రారంభిస్తాం. ఆ తర్వాత షూటింగ్‌ జరుపుకుంటుంది. ఫైనల్‌గా సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదలకు ఫిక్స్‌ అంటూ తెలిపారు.