'సైరా'లో ఝాన్సీ లక్ష్మీబాయ్‌గా అనుష్క...
ఝాన్సీ లక్ష్మీబాయ్‌గా అనుష్క కనిపించనుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో హీరోలకి సమానంగా ఆదరణ పొందింది. ఈమె ప్రస్తుతం "నిశ్శబ్దం" అనే చిత్రం చేస్తుంది. ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే అక్టోబరు రెండో తేదీన భారీ స్థాయిలో విడుదల కానున్న "సైరా" చిత్రంలో అనుష్క ముఖ్య పాత్ర పోషించిందని కొన్నాళ్ళుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎలాంటి క్లారిటీ రానప్పటికి అభిమానులు మాత్రం అనుష్క సినిమాలో కనిపించనుందని విశ్వసిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం 'సైరా' చిత్రంలో అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది. చిరంజీవి తర్వాత అంతటి పవర్ ఫుల్ రోల్ అనుష్కదే అని అంటున్నారు. పాత్ర చాలా కీలకం కాబట్టి ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచుతున్నారట.
కె.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సైరా' చిత్రంలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, తమన్నా, నయనతార, నిహారిక వంటి స్టార్‌లు కూడా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.