ఆదివారం, 10 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 అక్టోబరు 2022 (22:17 IST)

మొగల్తూరు తీర ప్రాంతంలో కృష్ణంరాజు స్మృతి వనం: మంత్రి రోజా

Roja_Prabhas
Roja_Prabhas
రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ నెల 11వ తేదీన అనారోగ్య సమస్యల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కృష్ణంరాజు తాజాగా జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణంరాజు పేరిట మొగల్తూరు తీర ప్రాంతంలో స్మృతి వనం ఏర్పాటు కోసం స్థలం కేటాయించనున్నామని మంత్రి రోజా తెలిపారు.
 
ఏపీ టూరిజం డిపార్టుమెంట్ తరపున ఈ స్థలాన్ని కేటాయించనున్నామని రోజా వెల్లడించారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సైతం ఈ విషయాన్ని వెల్లడించామని రోజా పేర్కొన్నారు. ప్రస్తుతం కృష్ణంరాజు స్మృతి వనంకు సంబంధించిన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఏపీలోని జగన్ సర్కార్ నిర్ణయాన్ని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఈ విషయంలో రోజాపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం సందర్భంగా మొగల్తూరు జనసంద్రమైంది. లక్ష నుంచి లక్షన్నర మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.