ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 14 సెప్టెంబరు 2024 (17:41 IST)

'దేవర' సినిమా ప్రమోషన్స్ చూస్తుంటే.. ఎన్టీఆర్ స్థాయిని దిగజార్చుతున్నాయా?

devara team
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన "దేవర" చిత్రం ఈ నెల 28వ తేదీన విడుదలకానుంది. అయితే, ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలు చూస్తుంటే హీరో జూనియర్ ఎన్టీఆర్ స్థాయిని దిగజార్చుతున్నట్టుగా ఉన్నాయనే టాక్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో సాగుతుంది. స్థాయిని దిగజార్చేలా ప్లానింగ్ చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
 
'ఆర్ఆర్ఆర్' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటిది ఆయన హీరోగా నటిస్తున్న "దేవర" సినిమా ప్రమోషన్స్‌కు "దేవర" సినిమాకు సంబంధంలేని వ్యక్తులతో ఇంటర్వ్యూలు ప్లాన్ చేయటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ముంబై వెళ్లిన 'దేవర' టీమ్ అక్కడ అలియా భట్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో ఇంటర్యూలు చేయించారు.
 
బాలీవుడ్ నటి అలియా భట్ స్వంత సినిమా "జిగ్రా"తో విడుదలకు సిద్దమవుతోన్న క్రమంలో "దేవర" వర్సెస్ "జిగ్రా" పేరుతో కరణ్ జోహార్ ఓ ఇంటర్యూ చేసాడు. సరే కరణ్ జోహార్ ఈ సినిమాను హిందీలో విడుదల చెస్తున్నారు కాబట్టి మార్కెటింగ్ కోసం చేశాడనుకోవచ్చు. కానీ సందీప్ రెడ్డి వంగా, 'దేవర' టీంతో ఇంటర్యూ చేయటం మరీ విడ్డూరంగా ఉందనే టాక్ వినిపిస్తుంది. ఈ ఇంటర్వ్యూ ప్రోమో తాజాగా విడుదలైంది.
 
నార్త్‌లో ‌హైప్ లేని కారణంగా అక్కడ క్రేజ్ ఉన్న సందీప్ రెడ్టి వంగాతో ఈ విధంగా ఇంటర్యూలను టీమ్ ప్లాన్ చేశారా అనటానికి.. ‌ఎన్టీఆర్‌కు అక్కడున్న క్రేజ్  ఏమైంది. ఇక ఇక్కడ సిద్ధూ, విశ్వక్‌లతో ఎన్టీఆర్ కొరటాల ఇంటర్యూను రికార్డు చేయటం అభిమానులను ఆశ్చర్యపరించింది. పైకి చూడటానికి ఇదేదో ఎంటర్‌‍టైనింగ్‌గా కనిపించినా.. ఎన్టీఆర్‌కున్న రేంజ్ ఏంటి..!! వారితో ఇంటర్యూ ఏంటి? యూట్యూబ్‌లో వ్యూస్‌కు తప్పితే.. 'దేవర' సినిమాకు ఇవన్నీ ఏవిధంగా ఉపయోగపడతాయి.. అసలు సినిమాలో విషయం ఉండాలి కదా అనే కామెంట్స్ కనిపిస్తున్నాయి.
 
ఇలా ఎన్టీఆర్ ఇమేజ్‌కు డామేజ్ కలిగించే ప్రయత్నం జరిగిందని ఎన్టీఆర్ రేంజ్‌కు తగ్గించే ప్రయత్నమిదనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తొంది. ఆల్రెడీ ముంబై ఈవెంట్‌లో "జై ఎన్టీఆర్" నినాదాలకు డబ్బులిచ్చి జనాలను కూడగట్టారనే అపవాదు విపరీతంగా వైరల్ అవ్వగా, తెలుగు మీడియా కంటే నార్త్ మీడియాకే 'దేవర' టీమ్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, తెలుగు మీడియాలో కూడా ఒకరిద్దరు చాలు అన్నట్టుగా వ్యవహరించటం వల్ల 'దేవర'కు సరైన రీతిలో ప్రమోషన్స్ లేదు. జూనియర్ రేంజ్ దిగజార్జే ప్రయత్నాలు జరుగుతాన్నాయనే బాధ అభిమానుల్లో వ్యక్తమవుతోంది.