గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 10 ఫిబ్రవరి 2024 (10:07 IST)

పవన్ కళ్యాణ్ చిత్రం ఓజీ కోసం థమన్ తో సుజిత్ భేటీ

Thaman-sujit
Thaman-sujit
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ఓజీ. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బేనర్ లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు ఈ చిత్రం షూటింగ్ సగానికిపైగా పూర్తయింది. తాజాగా హైదరాబాద్ శివార్లో షూటింగ్ జరుగుతుండగా సంగీత దర్శకుడు తమన్ వచ్చారు. దర్శకుడు సుజిత్ ఆయనతో భేటీ అయిన చిత్రాన్ని పోస్ట్ చేశారు.
 
ఈ చిత్రంలోని కథకు అనుగుణంగా బ్యాక్ గ్రౌండ్ ప్రాధాన్యత సంతరించుకుంది. దానిపై ఇరువురు బేటీ అయ్యారని తెలిసింది. ఈ చిత్రంలో పరిమితంగా పాటలుంటాయి. ఎక్కువ రణగొణ ధ్వనులు లేకుండా సరికొత్తగా ఉండేందుకు దర్శకుడు కసరత్తు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక ఆరుల్ నటిస్తుండగా, శ్రియా రెడ్డి ఓ కీలక పాత్ర పోషిస్తోంది. సెప్టెంబర్ లో సినిమా విడుదల కానుంది.