శనివారం, 5 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 జనవరి 2023 (10:50 IST)

ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ (video)

rrrmovie
టాలీవుడ్ ట్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డుల పంట పండించేందుకు సిద్ధం అయ్యింది. దర్శక ధీరుడు రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా విదేశాల్లోనూ రికార్డులను కొల్లగొడుతోంది. ప్రస్తుతం ఆస్కార్ రేసులో వున్న ఈ సినిమాకు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది. 
 
కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్ వేదికగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో బుధవారం రాజమౌళి, ఎన్టీఆర్, కీరవాణి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. నాటు నాటు పాటకు పురస్కారం ప్రకటించిన వెంటనే వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అందరూ  ఈ సందర్భంగా చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. 
 
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను డీవీవీ ఎంటర్ టైన్మెంట్ షేర్ చేసింది. ఈ అవార్డును ప్రకటిచండంతో రాజమౌళి చిన్న పిల్లాడిలా ఎగిరి గంతేశాడు. ఈ పాటపై మెగాస్టార్ చిరంజీవి మాత్రం సంతోషంతో ఉబ్బితబ్బిబైనట్లు కనిపిస్తోంది. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
 
ఇదో గొప్ప చరిత్ర ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పారు. బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడం అద్భుతం..  శతకోటి వందనాలు.. ఆర్ఆర్ఆర్ టీం, రాజమౌళికి కంగ్రాట్స్.. ఇప్పుడు ఇండియా ఎంతో గర్వపడుతూ ఉంటుందని ట్వీట్ చేశారు.