ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 నవంబరు 2022 (17:18 IST)

"ఓం శాంతి ఓం" అంటోన్న జాన్వీ కపూర్..

jhanvi kapoor
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అన్న సంగతి తెలిసిందే. ఆమె ఫోటోలు నెట్టింటిని భారీగానే షేక్ చేస్తున్నాయి. బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూనే.. ప్రస్తుతం టాలీవుడ్ వైపు కూడా కన్నేసింది. త్వరలో ఆమె ఎన్టీఆర్‌తో సినిమా చేయనుందనే విషయం హాట్ టాపిక్ అయ్యింది. 
 
ఇలాంటి పరిస్థితుల్లో ఇన్‌స్టాగ్రామ్ వీడియో కోసం జాన్వీ కపూర్ ఓ చిలిపి పని చేసింది. ఓం శాంతి ఓం సినిమాలో దీపికా పదుకొణె నటించిన ఓ సన్నివేశాన్ని అనుకరించింది. అంతేగాకుండా ఆ వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేసింది.  
 
పై నుంచి పాదాల వరకు ఒకే డ్రెస్ ధరించి డైలాగ్ చెప్పింది. వెంటనే వీడియోను అక్కడే ఉన్న నేలవైపు తిప్పగా.. కపూర్ స్నేహితుడు కింద పడుకుని నవ్వుతూ కనిపించడాన్ని చూడొచ్చు. దీనికి అభిమానులు కూడా భిన్నంగానే స్పందిస్తున్నారు.