గురువారం, 13 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2024 (15:52 IST)

శోభనం గదిలో భార్య రమ్ తాగితే లవ్ గురు ఏం చేసాడో తెలుసా !

Vijay Antony, Mrinalini Ravi
Vijay Antony, Mrinalini Ravi
వైవిధ్యమైన కాన్సెప్ట్ మూవీస్ చేస్తూ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటిస్తున్న రోమియో మూవీ తెలుగులో "లవ్ గురు" పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. "లవ్ గురు" సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు.
 
ఇవాళ "లవ్ గురు" సినిమా రిలీజ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. శోభనం రోజు గదిలో భర్త ఆశ్చర్యపోతూ చూస్తుండగా..భార్య రమ్ కలిపి ఇవ్వడాన్ని పోస్టర్ లో రివీల్ చేశారు. భార్య భర్తలుగా విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఇలా సింబాలిక్ గా పోస్టర్ ద్వారా చూపించారు. త్వరలో "లవ్ గురు" సినిమా రిలీజ్ డేట్ ను చిత్రబృందం ప్రకటించనున్నారు.
నటీనటులు - విజయ్ ఆంటోనీ, మృణాళినీ రవి, వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు