మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (20:00 IST)

అమితాబ్ బచ్చన్ డాన్ టికెట్‌ కోసం మైలు దూరం క్యూ - 44 ఏళ్ళ జ్ఞాప‌కాలు

amitabhbachchan Don quee
amitabhbachchan Don quee
అమితాబ్ బచ్చన్ అప్ప‌ట్లో బాలీవుడ్‌లో క‌థానాయ‌కుడిగా ఎవ‌ర్‌గ్రీన్‌. అన్ని హిట్ సినిమాలే. దేశంలో ఆయ‌న్ను అభిమానులు అనురించేవారు. ఇక ఆయ‌న హెయిర్ స్ట‌యిల్‌ను యూత్ అప్ప‌ట్లో ఆయ‌న్నే ఫాలో అయ్యేవారు. ఆయ‌న వాయిస్‌కు ఫిదా అయిపోయేవారు. అలాంటి అనుభ‌వాల‌ను అమితాబ్ బచ్చన్ ఈరోజే సోష‌ల్‌మీడియాలో షేర్ చేసుకున్నారు. 1978లో ముంబైలోని థియేట‌ర్‌లో టికెట్‌కోసం క్యూ క‌ట్టిన చిత్రాన్ని పోస్ట్ చేశారు.  `నా సినిమా డాన్ అడ్వాన్స్ బుకింగ్. ఎక్క‌డ చూసిన  క్యూలు ఒక మైలు పొడవు వున్నాయి. డాన్ సినిమా 1978లో విడుదలై .. 44 ఏళ్లు అయింది. అదే ఏడాది  డాన్, కస్మే వాడే, త్రిశూల్, ముఖద్దర్ కా సికందర్, గంగా కీ సౌగంధ్ .. ఒక సంవత్సరంలో 5 బ్లాక్ బస్టర్స్ .  వాటిలో కొన్ని 50 వారాల కంటే ఎక్కువ నడిచాయి.  క్యా దిన్ ది వో భీ !! అంటూ పెట్టిన పోస్ట్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. అప్ప‌టి బ్లాక్ అండ్ వైట్ ఫొటో పెట్టినందుకు నెటిజ‌న్లు అమితాబ్‌కు విషెస్ చెప్పారు.
 
ఈ చిత్రంలో..  పోలీసులు తీవ్రంగా గాలించే చట్టవ్యతిరేక వ్యాపారాలు నిర్వహించే డాన్ (అమితాభ్ బచ్చన్) వారికి చిక్కకుండా వారిని ముప్పుతిప్పలు పెడుతుంటాడు. డాన్ కో పకడ్నా ముష్కిల్ హీ నహీ, నా ముమ్కిన్ హై (డాన్ పట్టుకోవటం కష్టమే కాదు, అసాధ్యం కూడా) అన్నది డాన్ ఊతపదం.  ఇది ఎంత పాపుల‌ర్ అయిందో తెలియంది కాదు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్‌.టి.ఆర్‌.తో యుగంధ‌ర్‌గా తీశారు.  తమిళంలో బిల్లాగా రూపొందించబడింది. కథలో స్వల్ప మార్పులతో షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా 2007లో ఇదే పేరుతో ఈ చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమా డైలాగ్‌ను స్పూర్తిగా తీసుకుని డాన్ శీనులో రవితేజ డాన్ అవ్వాలనుకొంటాడు. ఈ సినిమాకూడా బాగా ఆడింది.