బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 జనవరి 2025 (13:19 IST)

జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం మంచిదే.. జానీ మాస్టర్ దంపతులు (video)

Jani Master
Jani Master
ప్రముఖ దర్శకుడు జానీ మాస్టర్ తన జైలు జీవితం గురించి మాట్లాడాడు. అరెస్ట్ టైంలో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి మద్దతు రాకపోవడంపైనా స్పందించాడు. జనసేన కార్యకలాపాలకు దూరంగా ఉండాలంటూ వచ్చిన ప్రెస్ నోట్ మీద కూడా రియాక్ట్ అయ్యాడు. 
 
ఇక అల్లు అర్జున్ అరెస్ట్ తరువాత జానీ మాస్టర్ సంతోషంగా ఉన్నాడంటూ వచ్చిన మీమ్స్‌ మీదా స్పందించాడు. అసలు పగవాడికి, శత్రువుకి కూడా జైలు జీవితాన్ని చూసే పరిస్థితి రావొద్దని జానీ మాస్టర్ చెప్పుకొచ్చాడు. జైల్లో ఫస్ట్ డే నరకంగా అనిపించిందట. ఎంతటి పెద్దవారైనా సరే నేల మీదే పడుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. ఆ రోజు జైల్లో తాను అలా ఒంటరిగా ఉండటం భరించలేకపోయాడని తెలిపాడు. 
 
తన భార్య, పిల్లలు, అమ్మ చాలా గుర్తుకు వచ్చారట. అమ్మకి అసలే ఆరోగ్యం బాగా లేదని, హార్ట్ కొంచెం వీక్‌గా ఉందని, ఇలాంటి విషయాలు తెలిస్తే ఇంకేం అవుతుందో అని టెన్షన్ పడ్డాడట. 
 
ఇక జనసేన పార్టీ నుంచి జానీని సస్పెండ్ చేయడం మంచి నిర్ణయమేనని ఆయన భార్య అన్నారు. జైలుకు వెళ్లిన వ్యక్తిని.. ఆరోపణలను వచ్చిన వ్యక్తిని పార్టీలో వుంచుకుంటే పార్టీకి ఇబ్బందులు, విమర్శలు తప్పవని తెలిపారు.