బుధవారం, 21 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 10 సెప్టెంబరు 2022 (16:00 IST)

పుష్ప సినిమాతో మంచి గుర్తింపు లభించింది - అక్షర

Akshara
Akshara
తెలుగమ్మాయి అక్షర నటన పట్ల ఆసక్తితో సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. మొదటగా కళ్యాణ్ రామ్ 'ఎంత మంచివడవురా' సినిమాతో పెళ్లి కూతురు పాత్రలో నటించింది. ఆ తరువాత రామ్ రెడ్ మూవీలో ఇంస్పెట్టర్ సంపత్ కుమార్తె రోలో లో మెప్పించింది, ఈ మూవీ తరువాత అల్లు అర్జున్, సుకుమార్ పుష్ప సినిమాలో హీరో వదిన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పుష్ప పార్ట్ 2 లో కూడా అక్షర పాత్ర కొనసాగుతుంది. రవితేజ సుధీర్ వర్మ కాంబినేషన్ లో వస్తోన్న రావణాసుర ఒక విభిన్న రోల్‌లో నటిస్తోంది. 
 
టాలెంటెడ్ ఉంటే తెలుగు పరిశ్రమలో అవకాశాలు ఎప్పుడూ తలుపు తడుతూనే ఉంటాయి అంటుంది అక్షర. నటనకు ప్రాధాన్యం ఉన్న మరిన్ని మంచి రోల్స్ చేయాలనేది అక్షర లక్ష్యం. తనలోని ట్యాలెంట్ చూసి ఆడిషన్స్ చేసి తనకు అవకాశాలు ఇస్తున్న దర్శక నిర్మాతలకు ఈ సందర్భంగా అక్షర కృతజ్ఞతలు తెలుపుతోంది. త్వరలో మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది అక్షర.