శుక్రవారం, 19 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఎంజీ
Last Modified: గురువారం, 26 ఆగస్టు 2021 (22:45 IST)

పంట పొలాల్లో భానుమతి రెడ్డి చిత్ర పోస్టర్‌ను ఆవిష్కరించిన రాజమహేంద్రవరం ఎంపీ భరత్ రామ్

నూతన తారాగణంతో రూపుదాల్చుతోన్న భానుమతి రెడ్డి చిత్ర పోస్టర్ ను రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ గురువారం ఆవిష్కరించారు.
 
గురువారం పశ్చిమగోదావరి జిల్లాలో చిత్ర యూనిట్ షూటింగ్ జరుగుతున్న ఈ ప్రాంతానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ఆ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. 
 
కార్యక్రమంలో భానుమతి రెడ్డి చిత్ర నిర్మాత రాంప్రసాద్ రెడ్డి, దర్శకులు సత్య, హీరోయిన్ అప్సర, హీరో బాలు ఎంపి భరత్ రామ్‌కు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలియజేశారు.