రకుల్ వార్నింగ్ - హరీశ్ శంకర్ సపోర్ట్
హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ తనపై ఓ ఆంగ్ల పత్రిక రాసిన వార్తకు తీవ్రంగా స్పందించింది. అంతేకాకుండా అవసరమైతే మీరు మా టీమ్‌కు హెల్ప్ చేస్తే మంచిదిగదా అంటూ చురక వేసింది. ఇటీవలే రకుల్‌పై ఆ పత్రిక అవకాశాలు కరువయ్యాయింటూ రాసింది. ఇది చదివిన ఆమె ఇలా స్పందించింది. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే. టాలీవుడ్లో నాకు అవకాశాలు రావడం లేదని నేను ఎప్పుడు చెప్పాను ?. అసలు ఒక ఏడాదికి ఎన్ని సినిమాలు చేయగలం? 365 రోజుల్లో ఇప్పుడు నేను చేస్తున్నా ఆరు సినిమాలు కాకుండా కొత్త ఆఫర్స్ కోసం దయచేసి నా డేట్స్ సర్దుబాటు చేయండి. ఒకవేళ మీరు అలా చేయగలిగితే ఆ విషయంలో మా టీమ్‌కి సాయం చేయండి అని ఆమె స్వీట్ వార్నింగ్ఇ చ్చింది
ఇది చూసిన తెలుగు దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. నాకు తెలుసు రకుల్. షూటింగ్స్ తో నువ్వు ఎంత బిజీగా ఉన్నావో. ఇటీవల నా ఫ్రెండ్ రాసిన స్క్రిప్ట్ నీకు బాగా నచ్చింది, అయినప్పటికీ.. నీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. అంటూ రకుల్ కి సపోర్ట్ చేశాడు హరీష్. అంతేకాకుండా నీ వర్కే వారికి సమాధానం చెబుతుందని పేర్కొన్నాడు.