సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 డిశెంబరు 2021 (11:16 IST)

RRR టీమ్ ప్రెస్ మీట్ LIVE:ఆ పులికంటే భయపెట్టింది జక్కన్నే!

RRR
సినిమా ప్రేమికులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న మూవీ ఆర్ఆర్ఆర్. రాజ‌మౌళి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ జ‌న‌వ‌రి 7న రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. ఇక జక్కన్న తన ఆర్ఆర్ఆర్ యూనిట్‌తో కలిసి అన్ని ప్రాంతాల్లో ప్రెస్ మీట్‌లు పెట్టేస్తున్నాడు.
 
ముంబై, బెంగళూరు, చెన్నైలలో ఎంతో స్పీడుగా ప్రెస్‌మీట్‌లు జరుగుతున్నాయి. జూనియర్‌ ఎన్టీఆర్, అజ‌య్ దేవ్ గ‌న్  రాంచరణ్, అలియా భట్‌తో పాటు రాజమౌళి ఆర్ఆర్ఆర్ టీమ్ అన్ని సిటీల్లో ప్రెస్‌ మీట్‌లతో బిజీగా ఉంది. తాజాగా హైదరాబాదులో జక్కన్న పెట్టిన ప్రెస్‌మీట్‌‌లో ఆర్ఆర్ఆర్‌‌ మూవీలో అజ‌య్ దేవ్ గ‌న్ పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. 
 
ఆర్ఆర్ఆర్ మూవీపై అజ‌య్ దేవ్‌గ‌న్ పాత్ర చాలా ప్ర‌భావం చూపిస్తుందన్నాడు. అలాగే ఈ చిత్రంలో పలు ఆయుధాలను వాడమని ట్రైలర్‌లో కొద్దిగానే చూపెట్టామని జక్కన్న అన్నారు. అలాగే ట్రైలర్‌లో పులితో పోటీపడే సీన్ గురించి తారక్ మాట్లాడుతూ... సెట్లో పులికంటే భయపెట్టింది జక్కన్నేనని తెలిపారు. కొమురం భీమ్ రోల్ కోసం బాగానే కష్టపడ్డానని తెలిపాడు.