గురువారం, 25 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2023 (16:32 IST)

గుడికి వెళ్లినప్పుడు చెప్పులు బయట వదిలేసినట్లే..: సింగర్ సునీత

Sunitha
సింగర్ సునీత తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలపై స్పందించింది. మూడేళ్ల క్రితం రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్న తర్వాత సింగర్ సునీత పేరు బాగా వైరల్ అయ్యింది. తాజాగా, ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలను పంచుకున్నారు. 
 
వ్యక్తిగత జీవితం గురించి రికార్డింగ్ స్టూడియోలో చర్చించాల్సిన అవసరం లేదని,  వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం వేర్వేరని చెప్పారు. గుడికి వెళ్లినప్పుడు చెప్పులు బయట వదిలేసి లోపలికి వెళ్లినట్టుగానే, స్టూడియోలోకి కూడా వెళ్తానని సింగర్ సునీత చెప్పారు.
 
తాను చాలా మృదుస్వభావినని, ప్రతిదానికీ కన్నీళ్లు పెట్టుకుంటానని సింగర్ సునీత చెప్పారు. అలా ఏడవకపోతే తాను ఆర్టిస్ట్‌ను ఎలా అవుతానని ప్రశ్నించారు.