సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2024 (17:31 IST)

శివకార్తికేయన్-ఏఆర్ మురుగదాస్ పాన్ ఇండియా షూటింగ్ పూజతో ప్రారంభం

Sivakarthikeyan,  Rukmini Vasanth
Sivakarthikeyan, Rukmini Vasanth
శివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో భారీగా నిర్మిస్తున్న చిత్రం నిన్న పూజా కార్యక్రమాలో లాంఛనంగా ప్రారంభమైయింది. తెలుగు, తమిళ్ లో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఉదయం మొదలైయింది.
 
mvie opening scean
mvie opening scean
అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో టాప్ లీగ్ యాక్టర్ శివకార్తికేయన్ హీరోగా రాబోయే యాక్షన్ చిత్రం గురించిన వార్తలను విన్న అభిమానులు థ్రిల్ అయ్యారు. షూటింగ్ ప్రారంభమైనట్లు అధికారికంగా ధృవీకరించడం అభిమానులకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది.
 
దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తన పాపులర్ స్టొరీ టెల్లింగ్ స్టయిల్ లో, యునిక్ సెట్టింగ్‌తో చిత్రాన్ని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ రాబోయే మాస్టర్‌పీస్ హై యాక్షన్-ప్యాక్డ్ అనుభూతిని అందిస్తుంది.
 
వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందజేస్తున్న హీరో శివకార్తికేయన్ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్, గ్రాండియస్ట్ చిత్రం కానుంది. శివకార్తికేయన్ ఇంతకు ముందు చూసినట్లుగా కాకుండా పూర్తిగా ప్రత్యేకమైన, స్టైలిష్  అవతార్ లో కనిపిస్తారు. ట్యాలెంటెడ్ కన్నడ నటి రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో కథానాయికగా నటించనున్నారు.
 
శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మ్యూజిక్ కంపోజర్ రాక్‌స్టార్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఎలామన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, అరుణ్ వెంజరమూడు ఆర్ట్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ కొరియోగ్రాఫ్ చేయనున్నారు.
 
ఈ సినిమా ఫస్ట్ లెగ్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై శరవేగంగా సాగుతోంది. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి త్వరలో తెలియజేయనున్నారు మేకర్స్.