కుందనపు బొమ్మ చిత్ర హీరో సుధీర్ ఆత్మహత్య
తెలుగులో వైజాగుకు చెందిన నటుడు కుందనపు బొమ్మ చిత్ర హీరో సుధీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక కారణాలుగా చెపుతున్నారు. సినిమాలకు కొంత పెట్టుపడి కూడా పెట్టాడని తెలుస్తుంది. కుందనపు బొమ్మ సినిమాతో పాటు సెకండ్ హ్యాండ్, షూట్ ఔట్ ఏట్ ఆలేర్ చిత్రాలలో కూడా నటించారు. కుందనపు బొమ్మ సినిమాలో సుధాకర్ కోమాకుల, చాందినీ చౌదరి తో పాటు సుధీర్ కూడా కీలక పాత్ర పోషించాడు.
తాజాగా అతడు వైజాగ్‌లో ఆత్మహత్య చేసుకున్నారనే వార్త ఫిలిం నగర్లో చర్చ గా మారింది. కొత్త తరం వెబ్ సీరియస్ తో కెరీర్ చూసుకుని ముందుకు సాగుతుండగా ఇలాంటివి జరగటం బాధగా ఉందని నటుడు సుధాకర్ ఆవేదన చెందాడు. అతడు లేడన్న విషయాన్ని జీర్ణించులేకపోతున్నానని ఫేస్‌బుక్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ఆయనతో పాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.