శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 జనవరి 2023 (15:45 IST)

బాలకృష్ణకు తప్పిన పెను ప్రమాదం.. ఏమైంది?

balakrishnaph
నందమూరి హీరో బాలకృష్ణకు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ గాలిలోనే తిరిగింది. ఈ రోజు ఉదయం ఒంగోలు నుండి హైదరాబాద్‌ రావాల్సిన నందమూరి బాలకృష్ణ గారి హెలికాప్టర్‌ వాతావరణం అనుకూలంగా లేకపోవడం వలన  ఒంగోలులో ఆగడం జరిగింది. 
 
పొగమంచు కారణంగా పైలెట్ ఒంగోలులో ల్యాండింగ్ చేశారు. పొగమంచు కారణంగా ల్యాండింగ్‌కు ఇబ్బంది ఏర్పడింది. ‌వాతావరణం కారణంగా ఆకాశంలోనే బాలయ్య హెలికాఫ్టర్ తిరగాల్సి వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. అయినా జాగ్రత్తగా ఆయన ల్యాండ్ అయ్యారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
చెన్నైలోని వాతావరణం విమానయానానికి అనుకూలంగా లేదు. దీంతో హెలికాప్టర్‌ను తిరిగి ఒంగోలుకు మార్చారు. దీంతో బాలయ్య 15 నిమిషాల పాటు ఆకాశంలో వేచి వుండాల్సి వచ్చింది. ఆపై రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ వెళ్లారు. ఆపై జనవరి 12న విడుదల కానున్న వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బాలకృష్ణ శుక్రవారం ఒంగోలు వచ్చారు.