సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 27 ఆగస్టు 2022 (16:39 IST)

అడవి దొంగ సినిమా చూపించి పేషెంట్‌ను వైద్యం చేసిన వైద్యులు

Doctors of Gandhi Hospital
Doctors of Gandhi Hospital
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు రెండు రోజుల క్రితం ఓ మహిళకు సినిమా చూపిస్తూ ఆమెను స్పృహలోనే ఉంచి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేశారు. ఆమె మెదడులోని కణుతులను తొలగించారు. ఆపరేషన్ జరుగుతున్నంత సేపు ఆమె చిరంజీవి నటించిన ‘అడవి దొంగ’ సినిమా చూశారు. ఆపరేషన్ చేస్తున్న వైద్యులు మధ్యమధ్యలో ఆమెతో మాటలు కలుపుతూ విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు.
 
వైద్య ప‌రిభాష‌లో ఈ ప్ర‌క్రియ‌ను అవేక్ క్రేవియోటోమీ అంటార‌ని ఆసుప‌త్రి సూపరింటెండెంట్ రాజారావు, న్యూరో స‌ర్జ‌న్ ప్ర‌కాశ‌రావు, అన‌స్తీషియా వైద్యురాలు శ్రీ‌దేవి తెలిపారు. యాదాద్రి జిల్లాకు చెందిన 60 ఏళ్ళ మ‌హిళ అనారోగంతో ఆసుప‌త్రిలో జాయిన్ అయింది. న్యూరాల‌జీ వైద్యులు ప‌రీక్షించి మెద‌డులో క‌ణితి వుంద‌ని ధృవీక‌రించారు. అనంత‌రం ఆమెకు ఆప‌రేష‌న్ చేయాల‌ని సూచించారు. ఇందుకు త‌గిన విధంగా ఏర్పాటుచేసి మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా ఆమెకు అడ‌విదొంగ సినిమా చూపించి చికిత్స చేశారు. ఈ విష‌యాన్ని ఆసుప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి.