సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 1 జూన్ 2023 (15:15 IST)

శ్రీనివాస్ బెల్లంకొండ హీరోగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో చిత్రం

harish shnakar, Sagar K Chandra Srinivas Bellamkonda and others
harish shnakar, Sagar K Chandra Srinivas Bellamkonda and others
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ బ్లాక్ బస్టర్ 'భీమ్లా నాయక్‌' కి దర్శకత్వం వహించిన దర్శకుడు సాగర్ చంద్ర ఇప్పుడు  హీరో శ్రీనివాస్ బెల్లంకొండ తో సినిమా చేస్తున్నారు. ఈరోజు ప్రత్యేక అతిథులతో #BSS10 మూవీ ఆఫీస్ లో పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైయింది. దర్శకుడు హరీష్ శంకర్ ముహూర్తం షాట్‌కు క్లాప్‌ కొట్టి, దర్శకుడు పరశురాంతో కలసి మేకర్స్‌కి స్క్రిప్ట్‌ను అందజేశారు. దర్శకుడు పరశురామ్ కెమెరా స్విచాన్ చేశారు. ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి కూడా పాల్గొన్నారు. జూన్ 2వ వారం నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
 
ఈ చిత్రం యూనిక్ సబ్జెక్ట్‌తో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్. దర్శకుడు, శ్రీనివాస్ బెల్లంకొండ కొత్త లుక్, క్యారెక్టర్‌లో ప్రజంట్ చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ పై రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్
 
ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, జిమ్షీ ఖలీద్  కెమరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ కాగా, మల్లికార్జున్ చెంచి ఆర్ట్ డైరెక్టర్.