మదిలో మది సినిమాలో ట్విస్టులు ఆకట్టుకుంటాయి : తాగుబోతు రమేష్
Taghubothu Ramesh, Jaya Kumar, Siri Ravula Chari and others
జయ కుమార్, శీను, స్వీటీ, సిరి రావుల చారి, సునీతలు ప్రధాన పాత్రల్లో నటించిన అందమైన ప్రేమ కథ చిత్రం మదిలో మది. ఎస్.కే.ఎల్.ఎమ్ క్రియేషన్స్ మీద నేముకూరి జయకుమార్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాకు ప్రకాష్ పల్ల దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగస్ట్ 18న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో సినిమా యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు తాగుబోతు రమేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
అనంతరం తాగుబోతు రమేష్ మాట్లాడుతూ.. జై అసిస్టెంట్‌గా పని చేశాడు. నాకు డ్రైవర్‌గా ఉండేవాడు. అప్పటి నుంచి ఫైర్ ఉండేది. కొంచెం పెద్ద వాళ్లని కలిసి సినిమాను ప్రమోట్ చేయమని చెప్పాను. రామ్ లక్ష్మణ్ మాస్టర్, బేబి డైరెక్టర్ సాయి రాజేష్ చేతుల మీదుగా ప్రమోషన్ చేయించాడు. నేను ఈ రోజు ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చాను. ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాడు. డైరెక్టర్ ప్రకాష్ ఈ సినిమాను బాగా తీశాడు. క్రాంతి కెమెరావర్క్ బాగుంది. సినిమాలో ట్విస్టులు బాగుంటాయి. ఈ సినిమాకు మీడియా సహకారం అందించాలి. నిర్మాతకు విజయం చేకూరాలని కోరారు.
హీరో జయ కుమార్ మాట్లాడుతూ.. నేను ఒక డ్రైవర్‌ని, అసిస్టెంట్‌ని. రమేష్ అన్న నాకు ప్రతీ విషయంలో అండగా నిలబడ్డాడు. నాకు చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. నా కుటుంబాన్ని పోషించుకునేందుకు డ్రైవర్‌గా పని చేశాను. ఓ యాక్టింగ్ స్కూల్‌లో ప్రకాష్ పరిచయం అయ్యాడు. నాలోని సినిమా పిచ్చిని, ప్యాషన్‌ను ప్రకాష్ గమనించాడు. మా ఇద్దరి స్నేహం వల్లే ఈ సినిమాను తీశాం. సినిమా కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్‌లో అందరూ ఏడుస్తారు. ఆగస్ట్ 18న ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ చిత్రంలో వల్గారిటీ ఉండదు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది అని అన్నారు.
హీరోయిన్ సిరి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నాకు చాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. యూట్యూబ్‌లో సాంగ్స్ చేసుకునే నేను ఇలా సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తుండటం ఆనందంగా ఉంది. మంచి ప్రేమ కథా చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వస్తుండటం ఆనందంగా ఉంది. నాకు ఎంతో సహకరించిన మా టీంకు థాంక్స్ అని అన్నారు.
దర్శకుడు ప్రకాష్ పల్ల మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం టీం అంతా చాలా కష్టపడ్డాం. డిసెంబర్ లాంటి చలికాలంలోనూ రాత్రిపగలూ కష్టపడ్డాం. క్రాంతి నీలా ఇచ్చిన విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. డీఐ, సౌండింగ్ అన్నీ బాగా వచ్చాయి. మా టీంలో అందరూ కష్టపడి కాదు ఇష్టపడి సినిమాను చేశారు. సినిమాను తప్పకుండా చూసి సక్సెస్ చేయండి అని అన్నారు.