ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 ఏప్రియల్ 2021 (16:35 IST)

ఓటీటీలోకి 'తెల్లవారితే గురువారం'.. ఆకట్టుకుంటుందా..?

Thellavarithe Guruvaram
వారాహి చిత్రం నిర్మించిన 'తెల్లవారితే గురువారం' సినిమా గత నెల 27న విడుదలై అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడీ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. కీరవాణి కుమారుడు సింహా హీరోగా మణికాంత్ దర్శకత్వంలో చిత్రాశుక్లా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు కీరవాణి మరో కుమారుడు కాలభైరవ సంగీతం అందించారు. 
 
సినిమా విడుదలైన 19 రోజులకే అంటే ఈ నెల 16న ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. థియేటర్లలో ఆకట్టుకోలేక పోయిన ఈ సినిమా ఓటీటీలోనైనా అలరిస్తుందేమో చూడాలి. 
 
లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మించారు. రాజీవ్‌ కనకాల, సత్య, అజయ్‌, వైవా హర్ష కీలకపాత్రలు పోషించారు. కాలభైరవ సంగీతం అందించారు.