గురువారం, 13 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (14:52 IST)

నటుడు పృధ్వీ ఆసుపత్రి పాలు కావడానికి వారే కారణం !

Prudhivi hospitalized
Prudhivi hospitalized
నటుడు పృధ్వీ  లైలా సినిమా లోని తన పాత్ర గురించి చెపుతూ, సినిమాలో ఎన్ని మేకలు ఉన్నాయని సుమ  అడిగినప్పుడు వైరల్‌గా మారిన అతని మేక వ్యాఖ్యలు? “సినిమాలో మేకలు ఉన్నాయి, కానీ అతను చెప్పిన సంఖ్య తప్పు. అలా మాట్లాడకూడదని, పృధ్వీ, విశ్వక్ మధ్య ఒకే ఒక్క సీన్ ఉంది. అభిమన్యు సింగ్ మటన్ వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి ఈ మేకలను సొంతం చేసుకున్నాడు’’ అని మేకల గురించి స్పష్టం చేశాడు. పృధ్వీ వ్యాఖ్యలకు జట్టు బాధ్యత వహించదని దర్శకుడు రామ్ నారాయణ్  అన్నారు. “సంఖ్యలు తప్పు మరియు అతనికి విశ్వక్‌తో సన్నివేశాలు లేవు; అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం' అని దర్శకుడు తెలిపారు.
 
ఈ సంఘటన తర్వాత వైసి. పి. వారు సోషల్ మీడియాలో ట్రోల్చేయడంతో వివాదం అయింది. దాంతో  నటుడు పృధ్వీ బి.పి.కి బి.పి పెరిగి ఆసుపత్రి పాలయ్యాడు. దానిపై హీరో విశ్వక్ సేన్ తాజాగా మాట్లాడుతూ, పాపం తను ఏమిచేయగలడు. దాదాపు  400 ఫోన్లు వచ్చాయట. అవి విన్న దగ్గరనుంచి బి.పి. రైజ్ అయింది. ఆ ఫోన్లో బూతులు, బెదిరింపులు ఉన్నాయని తెలిసింది. ఇకపై నా సినిమా ప్రమోషన్ లో ఇలాంటివి జరగకుండా చూస్తానని చెప్పారు.