ఆదివారం, 3 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2022 (10:55 IST)

బాలీవుడ్ నటుడు అరుణ్ బాలి కన్నుమూత

Arun Bali
Arun Bali
బాలీవుడ్ నటుడు అరుణ్ బాలి మరణించారు. 79 సంవత్సరాలు ఉన్న అరుణ్ బాలి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే నిన్న రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. ఆస్పత్రిలో మరణించిన సమాచారం అందుతోంది. ఇక అరుణ్ బాలి మరణం పట్ల, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలిపారు.
 
3 ఇడియట్స్, కేదార్‌నాథ్, పానిపట్ వంటి ఎన్నో హిట్ చిత్రాలలో తన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అరుణ్ బాలి.. టీవీ షోలోను కనిపించాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో, ప్రముఖ నటుడు అరుదైన దీర్ఘకాలిక న్యూరోమస్కులర్ వ్యాధి మస్తీనియా గ్రావిస్‌తో బాధపడుతున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 4:30 గంటలకు ముంబైలో మరణించాడు.
 
జాతీయ అవార్డు అందుకున్న ఈయన నిర్మాతగానూ రాణించాడు. అతను చివరిసారిగా ఆగస్ట్ 11, 2022న విడుదలైన ఫారెస్ట్ గంప్-లాల్ సింగ్ చద్దా యొక్క హాలీవుడ్ రీమేక్‌లో వృద్ధుడిగా కనిపించాడు.