బుధవారం, 27 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 29 ఆగస్టు 2022 (21:33 IST)

లైగర్ 'టైగర్' అవుతాడనుకుంటే ఇలా అయ్యిందేంటి? కార్తికేయ 2 'కిర్రాక్' కలెక్షన్లు

nikhil-vijay
విజయ్ దేవరకొండ, అనన్యపాండె జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో దూసుకొచ్చిన లైగర్... కలెక్షన్ల వ్యవహారంలో టైగర్ అవుతుందని అనుకుంటే అది కాస్తా బోర్లా పడినట్లు ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. విజయ్ దేవరకొండ ఎంతో కష్టపడి కండలు పెంచి మరీ తెరపై తన నటనతో ఆకట్టుకునేందుకు ప్రయత్నించాడు. కానీ విజయ్ దేవరకొండ కండలు పెంచేందుకు చేసిన కసరత్తు బాగానే వున్నా కథలో కండబలం లేదని టాక్ వస్తోంది. చిత్రం కోసం బడ్జెట్ సుమారు రూ. 175 కోట్లు ఖర్చు చేస్తే నాలుగు రోజులకు గాను వసూలైంది రూ. 46 కోట్లు. దీనితో ఖర్చు పెట్టిన సొమ్ము ఎన్నిరోజులకి వస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.

 
మరోవైపు సైలెంటుగా తెరపైకి వచ్చిన కార్తికేయ 2 చిత్రం కలెక్షన్లలో చిచ్చరపిడుగులా పరుగులుపెడుతోంది. కార్తికేయ చిత్రం బడ్జెట్ రూ. 30 కోట్లు. గత 3 వారాల్లో వసూలు చేసింది రూ. 100 కోట్లు. దీనితో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ పండగ చేసుకుంటున్నారు.