సినిమా తీయడం కాదు ఆడించడం గొప్ప : దిల్ రాజు
Dil raju, alanaati ramachandrudu team
కృష్ణవంశీ, మోక్ష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'అలనాటి రామచంద్రుడు'. చిలుకూరి ఆకాష్ రెడ్డి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రం టీజర్ ను బుధవారం సాయంత్రం ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, నిన్న అయోధ్యలో రాములవారికి ప్రాణ ప్రతిష్ట. ఈరోజు అలనాటి రామచంద్రుడు టీజర్ కో ఇన్సిడెంట్ గా వుంది. కొత్త నిర్మాత, దర్శకుడు, నటీనటులు చేసిన ప్రయత్నం బాగుంది. సినిమాతీయడం గొప్పకాదు. థియేటర్ లకు తీసుకెళ్ళి ఆడించడం గొప్ప. ఇప్పపుడు మీరు పరీక్ష రాశారు. ఇదివరకు పాస్ మార్కులు వస్తే చాలు అనుకునేవారు. కానీ నేటి ప్రేక్షకులు మార్కులు వేయాలి. ఆకాష్ మాటలు బాగున్నాయి. కొత్త దర్శకుడు, రైటర్ బాగా డీల్ చేశాడని టీజర్ ను బట్టి అర్థమైంది. హీరో హీరోయిన్లు కొత్తవారైనా టీజర్ లో బాగా చేశారనిపించింది. ఆల్ ది బెస్ట్ చెప్పారు.