గురువారం, 8 జూన్ 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By సెల్వి
Last Updated: బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (20:23 IST)

ధనుష్ ''సార్'' ట్రైలర్ మీ కోసం...

SIR
SIR
కొలవెరి మేకర్ ధనుష్ హీరో వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ సినిమా రూపుదిద్దుకుంటోంది. సూర్యదేవర నాగవంశీ - సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. 
 
సంయుక్త మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, తెలుగు-తమిళ భాషల్లో రూపొందింది. తమిళంలో ఈ సినిమా 'వాతి' అనే టైటిల్‌తో పలకరించనుంది. కొంతసేపటి క్రితం తెలుగు వెర్షన్‌కి సంబధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 
 
'ఎడ్యుకేషన్‌లో వచ్చేంత డబ్బు పాలిటిక్స్‌లో రాదు' .. 'డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు .. కానీ మర్యాద అనేది చదువు మాత్రమే సంపాదించిపెడుతుంది' అనే డైలాగ్స్ ట్రైలర్‌లో హైలైట్‌గా కనిపిస్తున్నాయి. 
 
సముద్రకని, సాయికుమార్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 17వ తేదీన విడుదల కానుంది.