శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (13:01 IST)

దేవుడి వస్త్రం, అక్షింతలు జగన్‌కు పడవా? నెటిజన్ల ట్రోల్స్

Jagan
Jagan
దేవుడి వస్త్రం, అక్షింతలు ఏపీ సీఎం జగన్‌కు పడవా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. శ్రీవారి అక్షింతలు, ఆయన వస్త్రం కోసం భక్తులు వేయికనులతో వేచి చూస్తుంటారు. అలాంటి దేవుడి వస్త్రం, అక్షింతలను ఏపీ సీఎం జగన్ నిర్లక్ష్యం చేశారని అంటున్నారు. 
 
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారికి సీఎం జగన్ ఏపీ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారి దర్శనం అనంతరం సీఎం జగన్‌కు ఆలయ అర్చకుడు వేదాశీర్వచనం అందించారు. 
 
అలాగే మంగళవారం శ్రీవారిని జగన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్షింతలు, వస్త్రం సమర్పించారు. అయితే సీఎం జగన్ అక్షింతలను వెంటనే తలపై నుంచి తొలగించారు. ఇలా జగన్ అక్షింతలను తొలగించడాన్ని ఆయనతో పాటు వచ్చిన ఎమ్మెల్యేలు చూస్తూ మిన్నకుండిపోయారు. 
 
అయితే నెటిజన్లు మాత్రం దేవుడి వస్త్రం, అక్షింతలు జగన్‌కు పడవా అంటూ ఫైర్ అవుతున్నారు. శ్రీవారిపై నమ్మకం లేని వ్యక్తి తిరుమలకు ఎందుకు వెళ్లాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. వేసిన అక్షింతలు దులుపుకునే కాడికి గుడికి పోవడం దేనికి అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.