మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 జూన్ 2022 (12:19 IST)

కింగ్ కోబ్రా వీడియో వైరల్.. డబ్బాలో ఆ వ్యక్తి ఎలా పట్టుకున్నాడంటే?

Snake
పాముల ప్రమాదకర వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నాయి. 
 
అందులో కింగ్ కోబ్రా ఒక ఇంటి లోపల తిష్టవేసింది. నాగుపాము ఇంట్లో పడగ విప్పి బుసలు కొడుతుండగా.. ఒక వ్యక్తి దానిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే తర్వాతి వీడియోలో ఏం జరిగిందో చూస్తే మీరు కూడా భయపడతారు.
 
వైరల్ అవుతున్న వీడియోలో.. కింగ్ కోబ్రా ఇంట్లో పడగ విప్పి బుసలు కొడుతోంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి దానిని పట్టుకోవడానికి వెళ్ళాడు. అతన్ని చూసిన వెంటనే అది బుసలు కొడుతూ మరింత రెచ్చిపోయింది. కింగ్ కోబ్రాను చూస్తే చాలా భయంకరంగా కనిపిస్తోంది. 
 
ఈ క్రమంలో కింగ్ కోబ్రా.. ఆ వ్యక్తి ప్లాస్టిక్ డబ్బాతో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కొంత సమయం పాటు ప్రయత్నించిన తర్వాత ఆ వ్యక్తి డబ్బాలో తాచుపామును బంధిస్తాడు.
 
ఈ సమయంలో పాము దాని నుంచి బయటకు వచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. ఇది చూసి అందరూ భయపడుతున్నారు.