సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By కుమార్
Last Updated : మంగళవారం, 28 మే 2019 (17:35 IST)

చంద్రబాబు నిరాయుధుడు.. ట్రోల్ చేయడం శాడిజం.. నాగబాబు

ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు చేసిన నాగబాబు ప్రస్తుతం ఆయనకు మద్దతుగా నిలిచాడు. తెలుగుదేశం ఓటమిపై సోషల్ మీడియాలో చంద్రబాబుపై వస్తున్న ట్రోల్స్‌కు ప్రతిస్పందనగా ఆయన ప్రతిస్పందిస్తూ ఓడిపోయిన నేతలను విమర్శడం చేతకానితనం అంటూ చంద్రబాబుకు మద్దతుగా పలికారు. 
 
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూడడంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై సోషల్‌మీడియాలో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఇలా ట్రోలింగ్ చేస్తూ పైశాచిక ఆనందం పొందడాన్ని నాగబాబు ఖండిస్తూ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.
 
జీవితంలో గెలుపోటములు సహజం. చంద్రబాబు గారు మన మాజీ సీఎం. ఇప్పుడు ఓడిపోయినంత మాత్రాన ఆయనను దారుణంగా విమర్శించటం తప్పు. ఒక వ్యక్తి అధికారంలో ఉండగా విమర్శించటం వేరు, ఓడిపోయాక విమర్శించటం వేరు, ఓడిపోయాక విమర్శించే వారిది చేతకానితనం. ప్రత్యర్థి నిరాయుధుడుగా ఉంటే వదిలెయ్యాలే కానీ, అవకాశం దొరికింది కదా అని ట్రోల్ చేయడం ఒక శాడిజం అంటూ నాగబాబు పోస్ట్ చేశారు.