గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2022 (18:31 IST)

నడిరోడ్డుపై నాగుపాము, కొండచిలువల ఫైట్.. (video)

Snake fight
Snake fight
సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు ట్రెండింగ్ కావడం మామూలే. అంతేకాదు పాముల వీడియోలను చూసేందుకు నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తాజాగా చూపరులను భయాందోళనకు గురిచేస్తూ రోడ్డుపైకి వచ్చి భీకరంగా ఫైట్‌ చేస్తున్న నాగుపాము, కొండచిలువల పోరుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ అరుదైన వీడియో యూట్యూబ్‌లో షేర్ చేయబడింది. ఇది చూసిన నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు మిలియన్ల మంది వీక్షించారు. ఈ సూపర్ డూపర్ ఫైట్ వీడియో మిలియన్ల కొద్దీ లైక్‌లతో ట్రెండింగ్ వీడియోగా మారింది.
 
ఈ వీడియోలో రెండు పెద్ద పాములు ఒకదానిని ఒకటి చంపుకునేందుకు పోరాడుతున్నాయి. నడి రోడ్డుపై రెండు భయంకర పాములు అల్లుకున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ వీడియో చూసిన చాలా మంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. వీడియో చివర్లో ఒక పాము మరో పాము నుండి తప్పించుకుని పారిపోతుంది.