శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Kowsalya
Last Updated : గురువారం, 30 ఆగస్టు 2018 (15:36 IST)

వెజిటబుల్ ఇడ్లీ ఎలా చేయాలో తెలుసా?

వెజిటబుల్ ఇడ్లీ కావలసిన పదార్థాలు: ఇడ్లీ పిండి - 4 కప్పులు జీడిపప్పు - కొద్దిగా వంటసోడా - కొద్దిగా నూనె - తగినంత క్యారెట్ - 1 క్యాబేజీ తురుము - పావుకప్పు బీన్స్ తురుము - పావుకప్పు కాప్సికమ్ - 1 పచ్చిబఠాణీలు - పావుకప్

కావలసిన పదార్థాలు:
ఇడ్లీ పిండి - 4 కప్పులు
జీడిపప్పు - కొద్దిగా
వంటసోడా - కొద్దిగా
నూనె - తగినంత
క్యారెట్ - 1
క్యాబేజీ తురుము - పావుకప్పు
బీన్స్ తురుము - పావుకప్పు
కాప్సికమ్ - 1
పచ్చిబఠాణీలు - పావుకప్పు
కొబ్బరిపొడి - 1 స్పూన్
ఉల్లిపాయ - 1
ధనియాల పొడి - 1 స్పూన్
కరివేపాకు - కొద్దిగా 
ఆవాలు, జీలకర్ర - 1/2 స్పూన్
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి పేస్ట్ - 1 స్పూన్
 
తయారీ విధానం: 
ముందుగా బాణలిలో నూనెను వేసి వేడయ్యాక అందులో జీడిపప్పు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, కూరగాయల ముక్కలు వేసుకుని కాసేపటి వరకు వేయించుకోవాలి. ఆ తరువాత ఆ మిశ్రమంలో ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ వంటసోడా, ధనియాల పొడి, కొబ్బరిపొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇడ్లీపిండిలో కలుపుకుని ఇడ్లీ పాన్‌లో ఇడ్లీల్లా వేసుకుని వాటిపై జీడిపప్పు చల్లుకుని ఆవిరి మీద ఉడికించుకోవాలి. అంతే... వెజిటబుల్ ఇడ్లీ రెడీ.