గురువారం, 20 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వినాయక చవితి
Written By Kowsalya
Last Updated : గురువారం, 6 సెప్టెంబరు 2018 (13:34 IST)

వినాయక చవితి విశిష్టతలు...

విఘ్నాలను నివారించే గణపతి జన్మదినమే వినాయకచవితి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షమి చవితి రోజున వినాయక చవితి పండుగను నిర్వహిస్తారు. ఆదిదంపతుల ప్రథమ కుమారుడైన గణపతిని పూజించనిదే ఏ పనిని ప్రారంభి

విఘ్నాలను నివారించే గణపతి జన్మదినమే వినాయకచవితి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షమి చవితి రోజున వినాయక చవితి పండుగను నిర్వహిస్తారు. ఆదిదంపతుల ప్రథమ కుమారుడైన గణపతిని పూజించనిదే ఏ పనిని ప్రారంభించరు. వినాయకుని అనుగ్రహం ఉంటే అన్ని విజయాలే లభిస్తాయి. ఈ చవితి నాడు ఉత్సవాల్లో పెద్దలతో పాటు పిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు.
 
కొన్ని ప్రాంతాల్లో గణపతి నవరాత్రులు నిర్వహిస్తుంటారు. ప్రతి ఇంట్లో వినాయకుడి బొమ్మను వివిధ రకాల పువ్వులు, పత్రితో పూజించి అనంతరం నిమజ్జనం చేస్తుంటారు. వినాయకుని నవరాత్రుల సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. భారతీయ సంప్రదాయంలో అన్ని వర్గాలలో జరుపుకునే పండుగల్లో వినాయక చవితి అగ్రస్థానం. 
 
గత కొన్ని సంవత్సరాలుగా వినాయక విగ్రహాల తయారుచేయడానికి పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నారు. మట్టితో గణపతి విగ్రహాల తయారీతో పాటు పర్యావరణ హితమైన రంగులను వాడుతుంటారు. దీంతో పలు తటాకాలు, నీటి వనరులు కలుషితం కాకుండా ఉంటాయి.