గురువారం, 19 మార్చి 2026
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By chitra
Last Updated : గురువారం, 7 జనవరి 2016 (10:22 IST)

కూరలు వాటి సహజ రంగు కోల్పోకుండా ఉండాలంటే...

అరటి పండ్లు ప్లాస్టిక్ ప్యాక్ డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే తొక్క నల్లబడకుండా పండు తాజాగా ఉంటుంది.
 
బంగాళాదుంపల చిప్ప్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కరివేపాకు ఆకులు వేసి ఉంచాలి.
 
చపాతీలు మెత్తగా ఉండాంటే గోరువెచ్చని నీటితో పిండి కలపాలి. అలాగే చపాతీ పిండి కలిపే ముందు ఆ నీటిలో చిటికెడు ఉప్పు, అర టీస్పూను పంచదార వేసినట్లైతే చపాతీలు మృదువుగా ఉంటుంది.
 
అరటికాయ ముక్కలను కాసేపు మజ్జిగలో వేసి తీసి వేయిస్తే త్వరగా వేగుతాయి.
 
బాదం పప్పును పది నిమిషాలు వేడి నీళ్ళలో నాన పెడితే పొట్టు సులువుగా వస్తుంది.
 
వంట చేసేటప్పుడు నూనె వేడెక్కగానే పసుపు వేస్తే, కూరలు వాటి సహజ రంగు కోల్పోకుండా ఉంటాయి.