గురువారం, 14 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 26 డిశెంబరు 2018 (12:53 IST)

ఉద్యోగానికి వెళ్లిన తర్వాతనే తెలిసింది.. చదువు విలువ..?

1. చెత్తకుప్పల మధ్య అనాధ చిన్నారులను చూసి చింతించటం కాదు..
మనం ఏమి చెయ్యగలమని బాధపడటమూ కాదు..
ప్రభుత్వాల వైఫల్యమని నిందించడం కాదు.. 
ప్రతీ మనిషి తన వృధా ఖర్చులు తన దురాలవాట్ల ఖర్చుతో వాళ్లని చేరదీస్తే..
ఎన్నో పేద జీవితాల బ్రతుకుల్లో వెలుగులు నింపవచ్చు.
 
2. ఒక మనిషి గొప్పతనం.. దుస్తుల్లోనో, హోదాలోనో, డబ్బుల్లోలో ఉండదు..
అతని గుండెలోని మంచితనంలో ఉంటుంది.
 
3. మనం ఎదిగేకొద్ది అవసరాలు పెరుగుతుంటాయి... 
అందుకే ఎక్కువ నడవలేక ఎడ్లబండ్లు కనిపెట్టాం..
అది సరిపోదని కార్లు కనిపెట్టాం.. తరువాత
వేగం సరిపోదని ప్లేన్ దాగా వెళ్లాం..
ఏదేక్కినా దిగాల్సింది.. నేలమీదే.. నడవాల్సింది కాళ్లతోనే..
 
4. బడికి పోవడం మొదలయ్యాక తెలిసింది... ఆటల విలువ..
కాలేజీలో చేరిన తరువాతనే తెలిసింది.. స్కూలు విలువ..
ఉద్యోగానికి వెళ్లిన తర్వాతనే తెలిసింది.. చదువు విలువ..
పదవి విరమణ అయ్యాకనే తెలిసింది.. ఉద్యోగం విలువ..
మరణానికి దగ్గరౌతున్నప్పుడే తెలిసింది.. జీవితం విలువ..