బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2022 (12:37 IST)

చిలకలూరి పేటలో కలకలం రేపుతున్న బాలుడి కిడ్నాప్

kidnapers
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఓ బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతుంది. చెన్నైలో ధాన్యం వ్యాపారం చేసే ఓ వ్యక్తి కుమారుడు రాజీవ్ సాయి కిడ్నాప్‌నకు గురయ్యాడు. దసరా పండుగ కోసం చిలకలూరి పేటకు ఆయన కుటుంబం వచ్చింది. ఈ క్రమంలో ఆ బాలుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు. 
 
గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఎనిమిదేళ్ల రాజీవ్ సాయిని కిడ్నాప్ చేశారు. చిలకలూరి పేటలోని 13వ వార్డులో ఉన్న దేవాలయంలో రాజీవ్ తల్లిదండ్రులు పూజలు చేస్తున్న సమయంలో బాలుడిని దుండగులు కిడ్నాప్ చేశారు.
 
రాజీవ్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తమ ముద్దుల కుమారుడు ఒక్కసారిగా కనిపించకుండా పోడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.