శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 మార్చి 2022 (11:09 IST)

'జబర్దస్త్' మానేసిన ఆర్కే.రోజా.. ఎందుకో తెలుసా?

సినీ నటి ఆర్కే.రోజా జబర్దస్త్‌ షోను మానేసినట్టు సమాచారం. ఈ షోకు ఇద్దరు న్యాయ నిర్ణేతలు ఉండగా వారిలో ఒకరు రోజా. ఈమె ప్రస్తుతం చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ శాసనసభ సభ్యురాలిగా అధికార వైకాపా తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 
 
ఇదిలావుంటే త్వరలోనే  ఏపీ మంత్రి మండలి పునర్‌వ్యవస్థీకరించనున్నారు. దీనికి సంబంధించి సిఎం వైఎస్ జగన్ ప్రకటన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులలో ఆసక్తిని పెంచింది. ఈ నేపథ్యంలో నగరి ఎమ్మెల్యే రోజాకు ఈసారి ఏపీ కేబినెట్‌లో అవకాశం వస్తుందని, పార్టీ అధిష్టానం నుంచి ఆమెకు స్పష్టమైన హామీ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
 
దీంతో జబర్దస్త్ షోకి రోజా వీడ్కోలు చెప్పబోతున్నారని, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ షోకు కొత్త జడ్జీలుగా ఆమని, లైలాలను ఎంపిక చేసినట్టు వస్తున్నాయి. అందుకే వీరిద్దరినీ పరిచయం చేసినట్టు సమాచారం. దీంతో త్వరలో ఆమె జబర్దస్త్ షో నుండి తప్పుకుంటారని, ఈ వార్తలపై ఎమ్మెల్యే రోజా ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం.