ఆదివారం, 5 ఫిబ్రవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated: గురువారం, 24 నవంబరు 2022 (11:32 IST)

జగన్ పర్యటనలో అపశృతి.. ట్రాఫిక్‌ ఏఎస్‌ఐ మృతి

ys jagan
శ్రీకాకుళం సీఎం జగన్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. బుధవారం సీఎం జగన్‌ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా పరిసర జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులకు నరసన్నపేటలో డ్యూటీ వేశారు.
 
అనకాపల్లి ట్రాఫిక్‌ ఏఎస్‌ఐగా పనిచేస్తున్న అప్పారావును సైతం నరసన్నపేటలో డ్యూటీ వేశారు. అయితే బందోబస్తు విధుల్లో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. అంతే ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.