ధర్నా చేసిన విద్యార్థులపై అత్యాచారం కేసు... ఎక్కడ?

woman and police
ఠాగూర్|
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన అడ్డదిడ్డంగా సాగుతోందని చెప్పేందుకు ఈ కేసు ఓ మంచి ఉదాహరణ. ప్రజల మానప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీసులే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. దీనికి ప్రత్యక్ష సాక్షినే.. ధర్నా చేసిన విద్యార్థులపై అత్యాచారం కేసు నమోదు చేయడం గమనార్హం. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ వింత కసు నమోదైంది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలీస్తే, తాడేపల్లిలోని సీఎం ఇంటి ముట్టడికి విద్యార్థి నేతలు యత్నించారు. అయితే, భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఐదుగురు విద్యార్థులు పోలీసుల కళ్లుగప్పిలోనికి ప్రవేశించారు. సీఎం ఇంటికి అర కిలోమీటరు దూరంలో ఉండగానే పోలీసులు ఐదుగురికి అదుపులోకి తీసుకున్నారు.

వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే, రిమాండ్ రిపోర్ట్ చూసిన జడ్జి షాక్ అయ్యాడు. ఇంటి ముట్టడికి యత్నించిన విద్యార్ధులపై అత్యాచారం కింద కేసు నమోదు చేయడం ఏంటని జడ్జి మండిపడ్డారు.

దీంతో షాకైన పోలీసులు, పాత మ్యాటర్‌ను ఎడిట్ చేసిన సమయంలో పొరపాటు జరిగిందని పోలీసులు వాటిని సరిచేసి కోర్టులో సబ్మిట్ చేశారు. అంటే.. ఏపీలో పోలీసుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు.దీనిపై మరింత చదవండి :