బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 ఏప్రియల్ 2021 (10:07 IST)

ఎన్ఆర్ఐ ఇంట్లో మంటలు.. ఆరుగురు సజీవదహనం.. పాత కక్షలే కారణమా?

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తుంటే.. నేరాల సంఖ్య పెరిగిపోతోంది. మహిళలపై దాడులు, అకృత్యాలు ఓ వైపు.. పాత కక్ష్యల కోసం ప్రాణాలు తీసేస్తున్నారు. అలా పాత కక్ష్యల కోసం ఓ ఎన్నారై కుటుంబం ప్రాణాలు కోల్పోయింది.  
 
విశాఖలోని పెందుర్తి మండలం జత్తాడలో ఓ ఎన్నారై కుటుంబం అగ్నికి ఆహుతైంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తోంది. 
 
వివరాల్లోకెళితే.. బుధవారం అర్ధరాత్రి మధురవాడ మిథిలాపురి కాలనీలోని ఆదిత్య టవర్స్‌లోని ఎన్ఆర్ఐ ఇంట్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు థాటికి ఆరుగురు సజీవదహనమయ్యారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
 
అయితే మిథిలాపురి కాలనీ, అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తులో 8 నెలల నుంచి ఎన్ఆర్ఐ కుటుంబం నివసిస్తున్నట్లు సమాచారం. చనిపోయిన వారిని బంగారు నాయుడు, డాక్టర్ నిర్మల, దీపక్ (22), కశ్యప్ (19)గా పోలీసులు నిర్ధారించారు. 
 
అయితే.. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరుగురి మృతికి కారణం పాత కక్షలేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.