గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (15:16 IST)

సిద్ధి వినాయ‌కుడిని ద‌ర్శించుకున్న ఎంపీ భ‌ర‌త్ రామ్

తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రిలోని నాళం భీమరాజు వీధిలో శ్రీ సిద్ధి వినాయక స్వామి వారిని ఎంపీ, వైయస్సార్ సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ దర్శించుకున్నారు. ఆల‌యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

విఘ్నేశ్వరుని కరుణా కటాక్షాలు ప్రజలందరికీ కలగాలని,  ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని తాను వినాయ‌కుడిని ప్రార్థించిన‌ట్లు మార్గాని భ‌ర‌త్ చెప్పారు.  నాయకులు కొత్త బాల మురళి కృష్ణ, దుర్వాసుల సత్యనారాయణ మూర్తి, కేదారిసెట్టీ గోవిందు తదితరులు పాల్గొన్నారు.