శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: సోమవారం, 7 సెప్టెంబరు 2020 (12:16 IST)

వైసీపీ బాధితుల కోసం టీడీపీ కంట్రోల్ రూమ్

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏడాదిన్నర పాలనకు చేరువవుతున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జిల్లాల్లో, గ్రామాల్లో వర్గపోరు పెరిగింది. పలు చోట్ల అధికార వైసిపీ, విపక్ష టీడీపీ నేతలు సై అంటే సై అంటున్నారు. పోలీసులు అధికార పార్టీ చెప్పినట్లు ఆడుతూ తమను లక్ష్యంగా చేసుకుంటున్నారని టీడీపీ ఆరోపిస్తుంది.
 
అక్రమ నిర్భంధాలు, అకృత్యాలు పెరిగాయి. ఇదే క్రమంలో తమ కార్యకర్తలతో పాటు సాధారణ జనానికి అండగా నిలిచేందుకు టీడీపీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వ బాధితులుగా మారిన వారికి అవసరమైన న్యాయ సహాయం అందించాలని టీడీపీ నిర్ణయించింది. ఇందుకోసం ఓ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.
 
ఇందుకోసం 7306299999 నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలిపితే వాటిని నమోదు చేసుకొని అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తెలిపారు. టీడీపీ కార్యకర్తలకు ఆ పార్టీ న్యాయ విభాగం ఇప్పటికే అవసరమైన సాయం అందిస్తుండగా ఇది వైసీపీ బాధితుల కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.