శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 ఏప్రియల్ 2020 (17:22 IST)

నరసారావు పేటలో 104 మందికి కరోనా .. కారణం ఏంటంటే?

గుంటూరు జిల్లా నరసారావు పేటలో ఏకంగా 104 మందికి కరోనా పాజిటివ్ సోకింది. దీనికి కారణ ఓ టీ వ్యాపారి అని తేలింది. ఈ విషయాన్ని అధికారుల విచారణలో తేలింది. ఈ టీ వ్యాపారి లాక్‌డౌన్ ఆంక్షలను ఉల్లంఘించి బస్టాండులో టీ విక్రయించాడు. ఆ టీని కొనుగోలు చేసి సేవించిన వారికి ఈ వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. ఫలితంగా నరసారావు పేటలో కరోనా వ్యాప్తి చెందినట్టు అధికారులు తేల్చారు. 
 
ఈ టీ వ్యాపారి ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన ఓ మత సమ్మేళనంలో పాల్గొని తిరిగి వచ్చాడు. ఈ టీ వ్యాపారి కరోనా సోకిన విషయం తెలియక తన రోజువారీ వ్యాపారమైన టీ విక్రయాలను సాగించాడు. దీంతో అతని వద్ద టీ కొనుగోలు చేసిన తాగినవారందరికీ ఈ వైరస్ సోకింది. అలా నరసారావుపేట వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపించింది.