శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (08:16 IST)

ప్రకాశం బ్యారేజీపై నీటి విమానాలు!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం బ్యారేజిపై నీటి విమానాలు దిగే ఏర్పాట్లు చేయాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. గుజరాత్‌లోని కేవడియా నుంచి అహ్మదాబాద్‌కు ఇలాంటి సేవలను ప్రధాని నరేంద్రమోదీ శనివారం ప్రారంభించిన విషయం తెలిసిందే.

దీనికి కొనసాగింపుగా ఏపీ సహా మరో 14 చోట్ల నీటి విమానాశ్రయాలు (వాటర్‌ ఏరోడ్రోమ్‌లు) ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

లక్షద్వీప్‌, అండమాన్‌-నికోబార్‌, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లలోనూ వివిధ మార్గాల్లో నీళ్లపై విమానాలు దిగేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేయనున్నట్లు నౌకాయాన మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. 

ప్రయాణికులు ఈ విమానాల్లోకి చేరుకునేందుకు, వీటి నుంచి బయటకు వచ్చేందుకు అవసరమైన జెట్టీలను నెలకొల్పడంలో సహకరించాల్సిందిగా భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ), పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు.. భారత అంతర్గత జలమార్గాల ప్రాధికార సంస్థ (ఏడబ్ల్యూఏఐ)ను కోరాయి.