శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 30 నవంబరు 2017 (18:59 IST)

రోజా పాదాలు బొబ్బలెక్కాయి..(ఫోటోలు)

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ నేతలు కూడా జగన్‌కు మద్దతుగా పాదయాత్రలు చేస్తూ వస్తున్నారు. జగన్ పాదయాత్ర మొదలుకాకముందు ఆ పార్టీకి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ నేతలు కూడా జగన్‌కు మద్దతుగా పాదయాత్రలు చేస్తూ వస్తున్నారు. జగన్ పాదయాత్ర మొదలుకాకముందు ఆ పార్టీకి చెందిన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన నియోజకవర్గం నుంచి తిరుమల వరకు పాదయాత్ర నిర్వహించారు.
 
అలాగే చిత్తూరు జిల్లా వైకాపా సీనియర్ నేత ఆ పార్టీ చంద్రగిరి శాసనసభ్యుడు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి కూడా జగన్ పాదయాత్ర విజయవంతం కావాలనే ఉద్దేశంతో తిరుమలకు పాదయాత్ర నిర్వహించారు. తాజాగా వైకాపా ఎమ్మెల్యే రోజా పాదయాత్ర చేపట్టారు. జిల్లాలో ప్రధాన నీటి ప్రాజెక్టు గాలేరు-నగిరి నిర్మాణంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ నగిరి సత్రవాడ నుండి పాదయాత్ర ప్రారంభించారు. 
 
డిసెంబర్ రెండవ తేది తిరుమల చేరుకొని ఆ స్వామివారికి తమ వినతిని విన్నవించుకొని యాత్ర ముగించనున్నారు. గాలేరు - నగరి ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేస్తున్న వైకాపా ఎమ్మెల్యే, మహిళా నేత రోజా పాదాలకు బొబ్బలెక్కాయి. గత మూడు రోజులుగా ఆమె పాదయాత్ర చేపట్టిన తరుణంలో పాదాలకు రోజా చికిత్స చేయించుకుంటున్న దృశ్యాలను రోజా ఫేస్‌బుక్ ఖాతాలో వుంచారు. రోజా పెట్టిన ఈ పోస్టు వైరల్ కాగా.. పలువురు ఆమెకు మద్దతు ప్రకటించారు.