గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

03-08-2021 మంగళవారం దినఫలాలు - ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల...

మేషం : ఆర్థిక విషయాల్లో కొంత మేరకు పురోగతి సాధిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి పనిభారం తప్పవు. బంధువులతో చిన్న చిన్న కలహాలు జరిగే ఆస్కారం ఉంది. ఇంజనీరింగ్, మెడికల్, కంప్యూటర్ శాస్త్ర రంగాల వారికి పురోభివృద్ధి. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. 
 
వృషభం : స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ లక్ష్యం నెరవేరుతుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. ఇతరులు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల ఇబ్బందులకు గురవుతారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. 
 
మిథునం : విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. సొంతంగా వ్యాపారం చేయాలనే దృక్పథం బలపడతుంది. నిరుద్యోగులకు సదావకాశాలు లభించినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. పాత మిత్రలు కలయికతో మీ ఆలోచనల్లో మార్పు సంభవిస్తుంది. లాయర్లకు, వైద్యులకు పురోభివృద్ధి కానవస్తుంది. 
 
కర్కాటకం : వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి ఆశించినంతగా ఉండదు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఆంక్షలు తప్పవు. మీ సంతానం విద్యా వివాహాలకు ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం. 
 
సింహం : రవాణా రంగాలలో వారికి మిశ్రమ ఫలితం కానవస్తుంది. ఇంటర్వ్యూలలో శ్రద్ధ వహించండి. ఫైనాన్స్, చిట్‌ఫండ్ రంగాలలో వారికి చికాకులు తప్పవు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. కాంట్రాక్టర్లకు మిశ్రమ ఫలితం. ఆకస్మికంగా సన్నిహితులతో మార్పులు కానవస్తాయి. 
 
కన్య : ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. కుటుంబీకులకు స్వల్ప విభేదాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. కళాకారులకు, పత్రికా, రచయితలకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రావలసిన ధనం చేతికందడంతో పొదుపు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. 
 
తుల : ఆర్థిక లావాదేవీలు బాగా కలిసివస్తాయి. సోదరీ, సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. అపార్థాలు మాని ఇతరులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. రాజకీయ రంగంలోని వారికి ఆరోగ్య లోపం, అధికశ్రమ ఉంటాయి. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. 
 
వృశ్చికం : ఫ్యాన్సీ, కిరాణా, మందుల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పాత రుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. దంపతుల మధ్య అవగాహనా లోపం. ఫైనాన్స్ చిట్‌ఫండ్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. నిరుద్యోగులకు లక్ష్య సాధనకు నిరంతర కృషి అవసరమని గమనించండి. 
 
ధనస్సు : వస్త్రములు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరిక నెరవేరుతాయి. సంఘంలో మీ మాటకు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. దూర ప్రయాణాలలో చికాకులు తప్పవు. విద్యార్థులు విదేశాలకు వెళ్లడానికి చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. కళాకారులకు అభివృద్ధి చేకూరుతుంది. 
 
మకరం : ఆర్థికంగా ఎదగడానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఒక శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగస్తుల శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
కుంభం : తలపెట్టిన పనులు అర్థాంతరంగా ముగిస్తారు. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. విద్యార్థులు విదేశాల్లో పై చదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. 
 
మీనం : మీ నైపుణ్యతకు, సామర్థ్యానికి తగినటువంటి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రావలసిన ధనం అందుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.